ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళీ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జాతీయ చేనేత అభివృద్ధి పథకం కింద స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి చేనేత, జౌళీ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని చేనేత, జౌళీ శాఖ కమిషనర్ కె.శ్రీకాంత్ ప్రభాకర్ ఒక ప్రకటన విడుదల చేశారు.
స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లలో క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు నాలుగు, టెక్స్టైల్ డిజైనర్ పోస్టులు నాలుగు కలిపి మొత్తం ఎనిమిది పోస్టులకు కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేపట్టినట్లు ఆయన తెలిపారు. 21 రోజులలోపు దరఖాస్తులను ‘కమిషనర్, చేనేత, జౌళీ శాఖ, 4వ అంతస్తు, IHC కార్పొరేట్ బిల్డింగ్, ఆటోనగర్, మంగళగిరి, గుంటూరు జిల్లా’ అడ్రస్ లో అందజేయాలని తెలిపారు. http://www.handlooms.ap.gov.in వెబ్సైట్ సందర్శించగలరు.
క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు హ్యాండ్లూమ్ టెక్నాలజీలో డిప్లొమా తో పాటు రెండేళ్ల అనుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
టెక్స్టైల్ డిజైనర్ పోస్టుకు టెక్స్టైల్ డిజైన్ కోర్సు ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
పత్రికాముఖంగా వచ్చిన నోటిఫికేషన్ వివరాల కొరకు క్రింది లింక్ పై క్లిక్ చేయండి
✅AP గ్రూప్-2 Mains, AP SI/Constable, SSC GD Constable, RPF Constable ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.