తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (MHSRB) నుంచి సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 435 పోస్టులను భర్తీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:
తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (MHSRB) నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
👉పోస్టుల వివరాలు:
సివిల్ అసిస్టెంట్ సర్జన్: 435 పోస్టులు
👉విద్యార్హతలు:
ఎంబీబీఎస్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
👉వయోపరిమితి:
2024 జూలై 1వ తారీఖు నాటికి 18 నుంచి 46 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
👉జీతభత్యాలు:
నెలకు రూ.58,850/- నుంచి రూ.1,37,050/- వరకు జీతం ఉంటుంది.
👉ఎంపిక విధానం:
ఎంబీబీఎస్ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తు ఫీజు:
రూ.120/- ఫీజు చెల్లించాలి. SC, ST, BC, EWS అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
👉దరఖాస్తుకు చివరి తేదీ:
2024 జూలై 11 వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.