SSC CGL 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి SSC CGL నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని 17,727 గ్రూప్-బి గ్రూప్-సి పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనున్నది. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 24వ తారీఖు లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:


ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును అనుసరించి 18 నుంచి 32 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు,
- బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
టైర్-1, టైర్-2 పరీక్షలు, ఫిజికల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.
| సంస్థ పేరు | స్టాఫ్ సెలక్షన్ కమిషన్ |
| పోస్టులు | గ్రూప్-బి, గ్రూప్-సి |
| విద్యార్హత | ఏదైనా డిగ్రీ |
| వయస్సు | 18 – 32 సం|| |
| జీతం | రూ.25,5000 – రూ.81,100 |
| ఎంపిక | రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్ |
| దరఖాస్తు | ఆన్లైన్ |
| ఫీజు | రూ.100/- (SC,ST- No Fee) |
| చివరి తేదీ | 2024 జూలై 24 |
👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅నిరుద్యోగుల కోసం: SSC MTS.. SSC GD Constable.. RPF Constable ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకొని మీకు కావలసిన కోర్స్ తీసుకోండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.