TG గ్రూప్-2 బిట్ బ్యాంక్: 1969 జై తెలంగాణ ఉద్యమ కాలంలో ఎవరు మొట్టమొదట ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షల్లో తెలంగాణ ఉద్యమ చరిత్ర & తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర టాపిక్స్ నుంచి అత్యధిక ప్రశ్నలు వస్తున్నాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SI-కానిస్టేబుల్, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్స్ పై పట్టు సాధించాలి. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి, ప్రీవియస్ ప్రశ్నపత్రాల నుంచి, సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్ నుంచి ఈ ప్రశ్నలను అందిస్తున్నాం.

📌Join Our Whatsapp Group

🎯Join Our Telegram Group

1). 1969 లో ఏ తేదీన పాల్వంచలో కృష్ణమూర్తి అనే వ్యక్తి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు?
Ans: జనవరి 10

2). 1969 జై తెలంగాణ ఉద్యమ కాలంలో ఎవరు మొట్టమొదట ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు?
Ans: అన్నా బత్తుల రవీంద్రనాథ్

3). తెలంగాణ ప్రజా సమితి తమ సంస్థను ఎప్పుడు ఒక రాజకీయ సంస్థగా ప్రకటించింది?
Ans: జూలై 1970

Khammam job Mela 2026 notification released
Khammam Job Mela 2026 – 10th, Inter, Degree Jobs | Salary ₹18,000 | Walk-in-interview

4). 1969 లో ఏ రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని భారత ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేసింది?
Ans: స్వతంత్ర పార్టీ

5). 1969లో జీవో 36ను కొట్టివేసిన సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ అధిపతి ఎవరు?
Ans: జస్టిస్ ఎం. హిదయతుల్లా

6). ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా జూన్ 17, 1969 ఏ దినంగా జరుపుకున్నారు
Ans: మహిళల దినం

7). 1969 జై తెలంగాణ ఉద్యమ కాలంలో ఏ ప్రభుత్వ ఉత్తర్వు జారీ చేయబడింది
Ans: జీవో నెంబర్ 36

8). తెలంగాణ ఉద్యోగస్తుల సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారాలను సూచించేందుకు 1969 ఏప్రిల్ లో కేంద్ర ప్రభుత్వం జస్టిస్ వాంచూ అధ్యక్షునిగా ఇద్దరు సభ్యులతో కమిటీని నియమించింది. ఆ ఇద్దరు సభ్యులు ఎవరు?
Ans: ఎం. సి. సెటల్ వాడ్ మరియు నెరెండే

9). 1969 తెలంగాణ ఉద్యమ తొలి అమరజీవి, 17 సంవత్సరాల శంకర్ ఎలా, ఎక్కడ మరణించాడు?
Ans: సదాశివపేటలో జరిగిన పోలీసు కాల్పులలో మరణించాడు

Khammam Job Mela 2026 – Private Jobs in Khammam District for Any Degree Qualification

10). డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మందస్తు నిర్బంధపు చట్టం మేరకు 1969 జూలై నెలలో అరెస్ట్ అయిన తర్వాత తెలంగాణ ప్రజా సమితి క్రింద ఉద్యమాన్ని కొనసాగించిన మహిళా నాయకురాలు ఎవరు?
Ans: సదాలక్ష్మి

11). 1969 ఉద్యమ ఆరంభంలో తెలంగాణ అంశంపై నిరాహార దీక్షకు కూర్చున్న తొమ్మిది సంవత్సరాల బాలిక ఎవరు?
Ans: అనురాధ

12). తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల మధ్య కృష్ణా నీటి పంపకాలకు సంబంధించి 1969లో భారత ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ చైర్మన్ గా ఎవరు నియమింపబడ్డారు?
Ans: ఆర్.ఎస్. బచావత్

13). డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రత్యేక తెలంగాణ మీద తన అభిప్రాయాలను తెలుపుతూ కాంగ్రెస్ అధ్యక్షునికి ఒక సుదీర్ఘ లేఖ వ్రాసెను. అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు?
Ans: యు.ఎన్. దేబర్

14). 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఏ సంస్థలోని ఉద్యోగ నియామక సమస్యతో ప్రారంభమైంది?
Ans: కొత్తగూడెం థర్మల్ విద్యుత్ క్షేత్రము

15). తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి బోర్డును రద్దు చేసిన ముఖ్యమంత్రి ఎవరు?
Ans: ఎన్.టి. రామారావు

Telangana High Court Office Subordinate Recruitment
Telangana High Court Office Subordinate Recruitment 2026 | Apply Online

✅తెలంగాణ నిరుద్యోగుల కోసం: SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable, RPF SI/కానిస్టేబుల్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!