తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షల్లో తెలంగాణ ఉద్యమ చరిత్ర & తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర టాపిక్స్ నుంచి అత్యధిక ప్రశ్నలు వస్తున్నాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SI-కానిస్టేబుల్, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్స్ పై పట్టు సాధించాలి. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి, ప్రీవియస్ ప్రశ్నపత్రాల నుంచి, సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్ నుంచి ఈ ప్రశ్నలను అందిస్తున్నాం.
పెద్ద మనషుల ఒప్పందం ముఖ్యమైన ప్రశ్నలు
- పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది?
Ans: 1956 ఫిబ్రవరి 20 - పెద్దమనుషుల ఒప్పందం ఎక్కడ జరిగింది?
Ans: ఢిల్లీలోని హైదరాబాద్ అతిథిగృహంలో - పెద్దమనుషుల ఒప్పందం పై తెలంగాణ ప్రాంతం నుండి ఎంత మంది సంతకాలు చేశారు?
Ans: 4 - పెద్ద మనుషుల ఒప్పందం పై తెలంగాణ ప్రాంతం నుంచి సంతకం చేసిన వారు ఎవరు?
Ans: బూర్గుల రామకృష్ణారావు, మర్రిచెన్నారెడ్డి, కె.వి.రంగారెడ్డి, జివి నర్సింగరావు - పెద్దమనుషుల ఒప్పందం పై ఆంధ్ర ప్రాంతం నుంచి సంతకాలు ఎవరు చేశారు?
Ans: బి. గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న, ఎ.సత్యనారాయణరాజు - 1956 నాటి పెద్దమనుషుల ఒప్పందం.. అప్పటి కేంద్ర హోం మంత్రి సమక్షంలో జరిగింది. కేంద్ర హోం మంత్రి ఎవరు?
Ans: గోవింద వల్లభ్ పంత్ - ఉప ముఖ్యమంత్రి పదవి అనేది చేతికి ఆరోవేలు లాంటిది అది నిరుపయోగమైనది అని పేర్కొన్నది ఎవరు?
Ans: నీలం సంజీవరెడ్డి - పెద్దమనుషుల ఒప్పందంపై ఎంతమంది సంతకం చేశారు?
Ans: 8 మంది - పెద్దమనుషుల ఒప్పందం లో ఎన్ని అంశాలపై అంగీకారం కుదిరింది?
Ans: 14 అంశాలు - పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం ముఖ్యమైన 5 మంత్రి పదవుల్లో రెండు మంత్రి పదవులు తెలంగాణ వారికే కేటాయించాలి. అయితే ఆ ఐదు మంత్రి పదవులు ఏవి?
Ans: హోం శాఖ, రెవెన్యూ శాఖ, ఆర్థిక శాఖ, ప్రణాళిక అభివృద్ధి శాఖ, వాణిజ్య పరిశ్రమల శాఖ - పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం రాష్ట్ర మంత్రివర్గంలో ఆంధ్ర-తెలంగాణ దామాషా 60:40 గా నిర్ణయించారు. అయితే తెలంగాణ మంత్రుల్లో ఎందరు ముస్లింలు ఉండాలి?
Ans: ఒకరు - పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణలో వ్యవసాయ భూముల అమ్మకం ఎవరి పర్యవేక్షణలో జరగాలి?
Ans: ప్రాంతీయ సంఘం - తెలంగాణలో వ్యవసాయ భూముల అమ్మకం ప్రాంతీయ సంఘం పర్యవేక్షణలో జరగాలి. అయితే ప్రాంతీయ సంఘాన్ని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి నియమిస్తారు?
Ans: 371 ఆర్టికల్ - పెద్దమనుషుల ఒప్పందం తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఆవిర్భవించింది?
And: 1956 నవంబర్ 1 - పెద్దమనుషుల ఒప్పందం లో పాల్గొన్న హైదరాబాద్ ముఖ్యమంత్రి ఎవరు?
Ans: బూర్గుల రామకృష్ణారావు - పెద్దమనుషుల ఒప్పందం తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి గవర్నర్ ఎవరు?
Ans: చందూలాల్ మాధవ్ త్రివేది - పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ అవసరాలకు, అభివృద్ధికి ఎంత మంది సభ్యులతో కూడిన ప్రాంతీయ సంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు?
Ans: 20
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం: SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.