తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షల్లో తెలంగాణ ఉద్యమ చరిత్ర & తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర టాపిక్స్ నుంచి అత్యధిక ప్రశ్నలు వస్తున్నాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SI-కానిస్టేబుల్, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్స్ పై పట్టు సాధించాలి. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి, ప్రీవియస్ ప్రశ్నపత్రాల నుంచి, సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్ నుంచి ఈ ప్రశ్నలను అందిస్తున్నాం.
తెలంగాణ ఉద్యమం – ముఖ్యమైన తేదీలు
- సిద్దిపేట ఉద్యోగ గర్జన – 21 అక్టోబర్ 2009
- జైల్ భరో కార్యక్రమం – 28 అక్టోబర్ 2009
- కాకతీయ విద్యార్థి గర్జన – 22 నవంబర్ 2009
- తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు – 24 డిసెంబర్ 2009
- తెలంగాణ బంద్ 30 డిసెంబర్ 2009
- తెలంగాణ విద్యార్థి మహాగర్జన – 3 జనవరి 2010
- వంటావార్పు – 3 ఫిబ్రవరి 2010
- మానవహారం – 4 ఫిబ్రవరి 2010
- సహాయ నిరాకరణ – 17 ఫిబ్రవరి 2011 నుంచి 4 మార్చి 2011 వరకు (16 రోజులు జరిగింది)
- పల్లె పల్లె పట్టాల పైకి (రైల్ రోకో) – 1 మార్చి 2011
- మిలియన్ మార్చ్ – 10 మార్చి 2011
- పట్నం రోడ్లపై పొయ్యి పెడతాం – 19 జూన్ 2011
- జనగర్జన సభ – 12 సెప్టెంబర్ 2011
- సకల జనుల సమ్మె – 13 సెప్టెంబర్ 2011 నుంచి 24 అక్టోబర్ 2011 వరకు (మొత్తం 42 రోజులు)
- సాగర హారం (తెలంగాణ మార్చ్) – 30 సెప్టెంబర్ 2012
- సమర దీక్ష – 27, 28 జనవరి 2013
- సడక్ బంద్ – 21మార్చి 2013
- సంసద్ యాత్ర (ఛలో ఢిల్లీ) – 27 ఏప్రిల్ 2013
- తెలంగాణ సత్యాగ్రహ దీక్ష – 29, 30 ఏప్రిల్ 2013
- ఛలో అసెంబ్లీ – 14 జూన్ 2013
- సంపూర్ణ తెలంగాణ దీక్ష – 7 జనవరి 2014
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం: SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.