తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటిఐ కాలేజీ ఆవరణలోని ఉపాధి కల్పనా కార్యాలయంలో ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈనెల 18 వ తారీఖున ఉదయం 10:30 కు జాబ్ మేళా నిర్వహించనున్నారు. మెడ్ ప్లస్ సంస్థలో జూనియర్ అసిస్టెంట్, ఆడిట్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, బి ఫార్మసీ, డి ఫార్మసీ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:
ఉపాధి కల్పనా కార్యాలయం, మంచిర్యాల జిల్లా నుంచి ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నోటిఫికేషన్ విడుదలైంది.
👉 ఉద్యోగాలు భర్తీ చేసే సంస్థ:
మెడ్ ప్లస్ సంస్థ వారు ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
👉పోస్టుల వివరాలు:
- జూనియర్ అసిస్టెంట్: 100
- ఆడిట్ అసిస్టెంట్: 30
- ఫార్మాసిస్ట్: 40
- కస్టమర్ సపోర్ట్ అసోసియేట్: 50
👉విద్యార్హతలు:
ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, బి ఫార్మసీ, డి ఫార్మసీ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
👉వయోపరిమితి:
18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉ఎంపిక విధానం:
వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.
👉 ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ:
18-12-2024 తేదీ ఉదయం 10:30 కు జాబ్ మేళా నిర్వహిస్తారు.
👉ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశము:
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటిఐ కాలేజీ ఆవరణలోని ఉపాధి కల్పనా కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తారు.
👉జాబ్ లొకేషన్:
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులు గోదావరిఖని, కరీంనగర్, మంచిర్యాల, హైదరాబాద్ ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది.
క్రింది లింక్ పై క్లిక్ చేసి పత్రిక ముఖంగా వచ్చిన నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకోండి
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం: SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.