తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సపోర్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం నాలుగు పోస్టులను భర్తీ చేస్తున్నారు. నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆఫ్లైన్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాతపరీక్ష ఉండదు. విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:
- డిస్ట్రిక్ట్ మెడికల్ & హెల్త్ ఆఫీసర్, నిజామాబాద్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
👉పోస్టుల వివరాలు:
- సపోర్ట్ ఇంజనీర్స్: 4 పోస్టులు
👉విద్యార్హతలు:
- B.TECH (CSE/ IT/ECE)/ MCA అర్హతతో పాటు సంబంధిత విభాగంలో 4 సంవత్సరాల అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉వయోపరిమితి:
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల లోపు వయసు ఉండాలి.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
👉జీతభత్యాలు:
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు
రూ:35,000/- జీతం ఉంటుంది.
👉ఎంపిక విధానం:
- విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు విధానం:
- అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- అధికారిక వెబ్సైట్ నుండి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకొని, ఫిల్ చేసి సంబంధిత ధ్రువ పత్రాలను జత చేసి, DMHO ఆఫీస్ కార్యాలయం నందు అందజేయాలి.
👉దరఖాస్తు ఫీజు:
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
👉దరఖాస్తుకు చివరి తేదీ:
- ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ:16-12-2024
- ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 23- 12-2024
👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✔️నిరుద్యోగుల కోసం: TS SI/Constable.. TS ఫారెస్ట్ బీట్ ఆఫీసర్.. AP గ్రూప్-2 Mains.. AP SI/Constable.. AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్.. “ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్” కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.