తెలంగాణ రెవెన్యూ శాఖలో సర్వేయర్ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మొత్తం 1,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీ వేదికగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వెల్లడించారు. పెద్ద మండలాలకు ఇద్దరు చొప్పున సర్వేయర్లను కేటాయిస్తామని తెలిపారు. వారిని నియమించిన తర్వాత ఆయా మండలాల్లో భూములను సర్వే చేయించి రెవెన్యూ అటవీ శాఖల మధ్య భూ వివాదాలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
విలేజ్ సర్వేయర్ ఉద్యోగాలకు 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. 10th క్లాస్ అర్హతతో పాటు, ఐటిఐ డ్రాఫ్ట్స్ మన్ సివిల్ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
నోటిఫికేషన్ విడుదల చేసే శాఖ
తెలంగాణ రెవెన్యూ శాఖ నుంచి విలేజ్ సర్వేయర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది.
పోస్టుల వివరాలు:
విలేజ్ సర్వేయర్ 1000 పోస్టులు
వయోపరిమితి:
ఈ ఉద్యోగాలకు 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు:
10th క్లాస్ అర్హతతో పాటు ఐటిఐ డ్రాఫ్ట్స్ మన్ సివిల్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం:
రాత పరీక్ష ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
క్రింది లింక్ పై క్లిక్ చేసి ఉద్యోగ ఖాళీల వివరాలు తెలుసుకోగలరు
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం: SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable, RPF SI/కానిస్టేబుల్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.