ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 5 జిల్లాల్లో డిసెంబర్ 30వ తేదీ, సోమవారం రోజున జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, పీజీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ప్రకాశం జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా, విజయనగరం జిల్లా, బాపట్ల జిల్లాల్లోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు.. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
▶️Organization Details:
ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
▶️Education Qualifications:
పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, పీజీ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.
▶️Age Limit:
18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
▶️Date of Interview:
30-12-2024 తేదీన ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు ముందుగా naipunyam.ap.gov.in వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. అభ్యర్థులు తమ బయోడేటా, ఆధార్ కార్డు, విద్యార్హత పత్రాలను ఇంటర్వ్యూకు తీసుకొని వెళ్ళాలి.
▶️Venue:
- ప్రకాశం జిల్లా: Government Degree College, Darsi.
- ప్రకాశం జిల్లా: Government Degree College, Pamur Road, Kanigiri.
- ఎన్టీఆర్ జిల్లా: Life Skills Vocational Junior College, Muktyala Road, Jaggayyapet (P&M).
- ఎన్టీఆర్ జిల్లా: Government Polytechnic for Women, Nandigama.
- గుంటూరు జిల్లా: VJ Degree College, Ganapathi Nagar, Mangalagiri.
- విజయనగరం జిల్లా: Sree Sai Siddhartha Degree College, Saradanagar, Gajapathinagaram.
- బాపట్ల జిల్లా: Sai Baba ITI College, Renangivaram Road, Addanki.
- బాపట్ల జిల్లా: ABR Government Degree College, Repalle.
Note: జిల్లాల వారీగా జాబ్ మేళా నిర్వహించే కంపెనీల వివరాల కొరకు, అర్హతల వివరాల కొరకు, జాబ్ లొకేషన్ వివరాల కొరకు, జీతభత్యాల వివరాల కొరకు క్రింది నోటిఫికేషన్ లింకుపై క్లిక్ చేయండి.
✅AP Forest Beat Officer, AP SI/Constable, SSC GD Constable, SBI Clerk, RRB Group-D ఆన్లైన్ కోచింగ్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.