RRB GroupD: 32 వేల పోస్టులతో రైల్వే గ్రూప్-డి నోటిఫికేషన్ విడుదల.. అర్హత: 10వ తరగతి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ నిరుద్యోగులకు అతి పెద్ద శుభవార్త తెలిపింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి లెవెల్-1 గ్రూప్-డి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 32,000 పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. పదవ తరగతి, ఐటిఐ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు భాషలోనూ పరీక్ష ఉంటుంది. సికింద్రాబాద్ జోన్ లో ఉన్న ఖాళీ పోస్టులకు ఏపీ, తెలంగాణ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 2025 జనవరి 23వ తారీకు నుంచి 2025 ఫిబ్రవరి 22 తారీకు వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది 18 నుంచి 36 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. జనవరి 23వ తారీకు నాటికి అధికారిక వెబ్సైట్లో పూర్తి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

📌Join Our Whatsapp Group

🎯Join Our Telegram Group

AP 10th Class Exams Schedule 2026: ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

👉పోస్టుల వివరాలు: 

Level-1 గ్రూప్-D: 32,000 పోస్టులు

👉విద్యార్హతలు: 

పోస్టులను అనుసరించి 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులకు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఐటిఐ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.

👉వయోపరిమితి: 

  • 2025 జూలై 1వ తారీకు నాటికి 18 నుంచి 36 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.
  • ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు 
  • బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

👉జీతభత్యాలు: 

నెలకు రూ.18,000 జీతం ఉంటుంది. జీతంతో పాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్స్ లు ఉంటాయి

IB Security Assistant Notification 2025
10th క్లాస్ అర్హతతో ఇంటెలిజెన్స్ విభాగంలో 4,987 సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ.. తెలుగు భాష రావాలి

👉ఎంపిక విధానం:

కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్, తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తు విధానం: 

అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 23వ తారీకు నుంచి అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తు ఫీజు: 

  • ఓసి, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ కమ్యూనిటీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.250 ఫీజు చెల్లించాలి.

👉దరఖాస్తు తేదీలు: 

23-01-2025 తారీకు నుంచి 22-02-2025 తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

  • 👉ముఖ్య గమనిక: జోన్ల వారీగా, పోస్టుల వారీగా ఖాళీల వివరాలు.. విద్యార్హతలు, ఎంపిక విధానం, సిలబస్ వివరాలను RRB జనవరి 23 వ తారీఖున విడుదల చేసే పూర్తీ నోటిఫికేషన్లో తెలపనుంది. 
  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

రైల్వే శాఖలో 6,238 టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Official Website

✅నిరుద్యోగుల కోసం: RRB Group-D “ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్” కేవలం “399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!