తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ జిల్లా కోర్టు/ హైకోర్టుల్లో టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశారు. మొత్తం 1,673 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 7వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 8వ తారీకు నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
👉పోస్టుల వివరాలు:
ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, కాపీఇస్ట్, కోర్టు మాస్టర్, కంప్యూటర్ ఆపరేటర్, సిస్టం అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య: 1,673
👉విద్యార్హతలు:
పోస్టును అనుసరించి 7వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉వయోపరిమితి:
18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
👉జీతభత్యాలు:
పోస్టును అనుసరించి రూ.19,000 నుంచి రూ.1,12,510 వరకు జీతం ఉంటుంది.
👉ఎంపిక విధానం:
రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు విధానం:
అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉పరీక్ష ఫీజు:
ఓసి, బీసీ అభ్యర్థులు రూ.600; ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.400 ఫీజు చెల్లించాలి.
👉దరఖాస్తు తేదీలు:
08-01-2025 తేదీ నుంచి 31-01-2025 తేదీ వరకు హైకోర్టు అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్లు డౌన్లోడ్ చేసుకోండి
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం: “జిల్లా కోర్టు/ హైకోర్టు, SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్+Test Series “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.