తెలంగాణ రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్, శాంపుల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 22 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్హత, వయస్సు, జీతం దరఖాస్తు వివరాలు తెలుసుకుందాం.
👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:
ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది
👉పోస్టుల వివరాలు:
- డేటా ఎంట్రీ ఆపరేటర్: 01
- శాంపుల్ అసిస్టెంట్: 01
👉విద్యార్హతలు:
- డేటా ఎంట్రీ ఆపరేటర్: ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు PGDCA కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి, సంబంధిత విభాగంలో ఐదు సంవత్సరాలు అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- శాంపుల్ అసిస్టెంట్: ఇంటర్మీడియట్ అర్హతతో పాటు సంబంధిత విభాగంలో రెండు సంవత్సరాలు అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉వయోపరిమితి:
22 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న బిడ్డలు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.
👉జీతభత్యాలు:
- డేటా ఎంట్రీ ఆపరేటర్: రూ.19,500/-
- శాంపుల్ అసిస్టెంట్: రూ.15,600/-
👉దరఖాస్తు విధానం:
అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తు తేదీలు:
08-01-2025 తేదీ నుంచి 10-01-2025 తేదీలోపు ఫుడ్ సేఫ్టీ జిల్లా కార్యాలయం నందు దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం: జిల్లా కోర్టు/ హైకోర్టు ఉద్యోగాలు, SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.