తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టు ఉద్యోగాలు భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఆఫీస్ సబార్డినేట్, సీనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి, ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 13వ తారీకు లోపు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:
ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది
👉పోస్టుల వివరాలు:
- ఆఫీస్ సబార్డినేట్: 02 పోస్టులు
- సీనియర్ అసిస్టెంట్: 01 పోస్టు
- టైపిస్ట్: 01 పోస్టు
మొత్తం పోస్టుల సంఖ్య: 04
👉విద్యార్హతలు:
- ఆఫీస్ సబార్డినేట్: 7th క్లాస్/ 10th క్లాస్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- సీనియర్ అసిస్టెంట్: ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు.
- టైపిస్ట్: ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు టైపు రైటింగ్ హైయర్ గ్రేడ్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉వయోపరిమితి:
01-07-2025 తేదీ నాటికి 18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
👉జీతభత్యాలు:
- ఆఫీస్ సబార్డినేట్: రూ.15,600
- సీనియర్ అసిస్టెంట్: రూ.22,750
- టైపిస్ట్: రూ.19,500
👉 సెలక్షన్ ప్రాసెస్:
- ఆఫీస్ సబార్డినేట్: విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ టెస్ట్ చేసి, ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- సీనియర్ అసిస్టెంట్: విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ టెస్ట్ చేసి, ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- టైపిస్ట్: టైపింగ్ స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు.
👉అప్లై చేయు విధానం:
అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తు ఫీజు:
ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు ఉండదు.
👉దరఖాస్తు తేదీలు:
అర్హత కలిగిన అభ్యర్థులు 13-02-2025 తేదీ లోపు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
👉క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం: “జిల్లా కోర్టు/ హైకోర్టు, SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్+Test Series “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.