పోస్టల్ శాఖ నుంచి ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ పోస్టల్ సర్కిల్లలో మొత్తం 21,413 గ్రామీణ డాక్ సేవక్ (జిడిఎస్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు తెలుగు భాష ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ లుగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:
పోస్టల్ శాఖ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
👉పోస్టుల వివరాలు:
1.బ్రాంచ్ పోస్ట్ మాస్టర్
2.అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్
3.డాక్ సేవక్
మొత్తం పోస్టుల సంఖ్య: 21,413
👉 తెలుగు రాష్ట్రాల్లో ఖాళీల సంఖ్య:
ఆంధ్రప్రదేశ్: 1,215 పోస్టులు
తెలంగాణ: 519 పోస్టులు
👉విద్యార్హతలు:
10th క్లాస్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉వయోపరిమితి:
18 నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు,
బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు
దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
👉జీతభత్యాలు:
1.బ్రాంచ్ పోస్ట్ మాస్టర్: ₹.12,000 – ₹.29,380
2.అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్: ₹.10,000 – ₹.24,470
3.డాక్ సేవక్: ₹.10,000 – ₹.24,470
👉ఎంపిక విధానం:
10వ తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు విధానం:
ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తు ఫీజు:
రూ.100/- ఫీజు చెల్లించాలి
మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
👉దరఖాస్తు తేదీలు:
10-02-2025 తేదీ నుంచి 03-03-2025 తేదీ లోపు అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
👉క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅నిరుద్యోగుల కోసం: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్సై/ కానిస్టేబుల్, RRB Group-D ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కేవలం “399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.