Telangana Govt Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహిళా శిశుసంక్షేమ శాఖలో 14,236 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
తెలంగాణ రాష్ట్రంలోని మహిళా శిశు సంక్షేమ శాఖలో కొలువుల జాతర మొదలైంది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీకి ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చేసింది. ఖాళీల భర్తీకి సంబంధించిన ఫైల్ పై మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు. మొత్తం 6399 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 7837 హెల్పర్ల పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఎన్నికల కోడ్ ముగియగానే నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీకి సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నారు. మొత్తం 14,236 పోస్టులను తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయనుంది.
ఈ ఉద్యోగాలకు 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. ఫీజు ఉండదు. విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, ఇంటర్వ్యూ, అనుభవాన్ని ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎక్కడైతే ఖాళీ పోస్టులు ఉంటాయో.. ఖాళీ పోస్ట్ ఉన్న ప్రాంతంలో నివాసం ఉన్న వివాహిత మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
✅ తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్సై/కానిస్టేబుల్, RRB Group-D ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅ మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.