SSC MTS 2025: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ & హవల్దార్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ (SSC MTS & Havaldar Notification 2025) విడుదలైంది. ఈ నోటిఫికేషన్ 1,075 హవాల్దార్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు భాషలోనూ నిర్వహిస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, ఫిజికల్ టెస్ట్, సిలబస్ దరఖాస్తు ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
👉 Organization details:
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
👉 SSC MTS 2025 Vacancy Details:
ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS), హవాల్దార్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. హవాల్దార్ 1,075 పోస్టులను భర్తీ చేస్తున్నారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల ఖాళీల వివరాలను సేకరిస్తున్నారు. త్వరలో అప్డేట్ చేస్తారు.
👉 Education Qualification:
పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉 SSC MTS 2025 Age limit:
MTS ఉద్యోగాలకు 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. హవాల్దర్ ఉద్యోగాలకు 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
👉 Selection Process:
MTS పోస్టులు: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
హవాల్దార్ పోస్టులు: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
కంప్యూటర్ బేస్డ్ పరీక్షలను 20-09-2025 తేదీ నుంచి 24-10-2025 వరకు నిర్వహిస్తారు. పరీక్షలను ఇంగ్లీష్ భాషతో పాటు తెలుగు భాషలోనూ నిర్వహిస్తారు.
👉 How to Apply:
అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 26-06-2025 తేదీ నుంచి 24-07-2025 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
👉 Application Fee:
రూ.100/- ఫీజు చెల్లించాలి. మహిళా అభ్యర్థులకు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
▶️ క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅SSC MTS & Havaldar ఉద్యోగాలకు సంబంధించిన Full Course + Test Series కేవలం రూ.499/- ఇవ్వడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP Install చేసుకుని కోర్స్ తీసుకోండి.
✅ ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం క్రింది వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి.