IB Security Assistant Recruitment: ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 4,987 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు ఉన్నాయి. పదవ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు భాష ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
👉IB Security Assistant Organization Details:
ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
👉 పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా 4,987 సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 115, తెలంగాణ రాష్ట్రంలో 117 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
👉IB Security Assistant Age limit:
17-08-2025 తేదీ నాటికి 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
👉జీతభత్యాలు:
నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతం ఉంటుంది. అలాగే ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.
👉 ఎంపిక విధానం:
టైర్-1 ఆన్లైన్ ఎగ్జామినేషన్, టైర్-2 డిస్క్రిప్టివ్ టెస్ట్, టైర్-3 ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.
👉 దరఖాస్తు విధానం:
అర్హత కలిగిన అభ్యర్థులు 26-07-2025 తేదీ నుంచి 17-08-2025 తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు www.mha.gov.in వెబ్సైట్ ద్వారా కానీ, లేదా www.ncs.gov.in వెబ్సైట్ ద్వారా కానీ దరఖాస్తు చేసుకోవాలి.
👉పరీక్ష ఫీజు/ అప్లికేషన్ ఫీజు:
రూ.550/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. UR, EWS, OBC పురుష అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు తో పాటు రూ.100 పరీక్ష ఫీజు (550+100=650) కూడా చెల్లించాలి.
▶️గమనిక: అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లింకుపై క్లిక్ చేసి.. పూర్తిస్థాయి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు చదివి దరఖాస్తు చేసుకోగలరు.
👉 క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.