TG RTC Jobs 2024: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీలో 3,035 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయనున్నారు.
✅నిరుద్యోగుల కోసం: SSC MTS.. SSC GD Constable.. RPF Constable ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.
తెలంగాణ ఆర్టీసీలో 3,035 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం 11 రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో అత్యధికంగా డ్రైవర్ పోస్టులు ఉండనున్నాయి, ఆ తర్వాత అత్యధికంగా శ్రామిక్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాల బర్త్డేకి త్వరలో నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
డీఎం/ ఏటీఎం: 25
అసిస్టెంట్ మెకానిక్ ఇంజనీర్: 15
శ్రామిక్: 743
డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్): 114
డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్): 84
డ్రైవర్: 2,000
అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్): 23
సెక్షన్ ఆఫీసర్ (సివిల్): 11
అకౌంట్స్ ఆఫీసర్: 06
మెడికల్ ఆఫీసర్ (జనరల్): 07
మెడికల్ ఆఫీసర్ (స్పెషలిస్ట్): 07
మొత్తం పోస్టుల సంఖ్య: 3,035
ఆర్టీసీలో 3,035 పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వడంపై సీఎం రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. త్వరలో కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామని, వాటికి అనుగుణంగా కొత్త నియామకాలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.