AP Mega DSC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్, మెగా డీఎస్సీ నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. టెట్, మెగా డీఎస్సీ నిర్వహణకు సంబంధించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం కీలక ప్రకటన చేశారు.
టెట్, మెగా డీఎస్సీ ప్రిపరేషన్ కు 90 రోజుల చొప్పున సమయం ఇవ్వనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. నిరుద్యోగుల నుంచి, విద్యార్థి సంఘాల నుంచి వచ్చిన వినతుల మేరకు అధికారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. టెట్ పరీక్షకు 90 రోజులు, మెగా డీఎస్సీ పరీక్షకు 90 రోజుల చొప్పున సమయం ఇస్తూ.. త్వరలోనే కొత్త షెడ్యూల్ విడుదల చేస్తామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.
✅AP గ్రూప్-2 Mains, AP SI/Constable, SSC GD Constable, RPF Constable ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.