TG Government Jobs: తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో 872 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయనున్నారు.
✅నిరుద్యోగుల కోసం: SSC MTS.. SSC GD Constable.. RPF Constable ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన వైద్య కళాశాలల్లో 872 పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థికశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. వీటిని కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయాలని వైద్యశాఖకు సూచించింది. జోగులాంబ గద్వాల, నారాయణపేట, మెదక్, ములుగు, నర్సంపేట, యాదాద్రి భువనగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ వైద్య కళాశాలల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఒక్కో కళాశాలకు 109 పోస్టుల చొప్పున మంజూరు చేశారు. 109 పోస్టుల్లో.. 25 ప్రొఫెసర్, 28 అసోసియేట్ ప్రొఫెసర్, 56 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉంటాయి. ప్రొఫెసర్ కు రూ.1.90 లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్ కు రూ.1.50 లక్షలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కు రూ.1.25 లక్షల గౌరవ వేతనం చెల్లించాలని ఆర్థికశాఖ ఆదేశించింది. వీరిని తొలుత వచ్చే మార్చి 31 వరకు నియమించాలని తెలిపింది. ఈ పోస్టులను రెగ్యులర్ విధానంలో భర్తీచేసే వరకు లేదా ఈ పోస్టుల అవసరం ఉన్నంత వరకూ వీరిని కొనసాగించాలని తెలిపింది.