RRB NTPC Notification 2024: రైల్వే శాఖలో ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 8113 నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి (NTPC) గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కం టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
👉పోస్టుల వివరాలు:
- చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్: 1736
- స్టేషన్ మాస్టర్: 994
- గూడ్స్ ట్రైన్ మేనేజర్: 3144
- జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కం టైపిస్ట్: 1507
- సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్: 732
మొత్తం పోస్టులు: 8113
👉విద్యార్హతలు:
ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉వయోపరిమితి:
18 నుంచి 36 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు
- బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
👉జీతభత్యాలు:
- చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్: రూ.35,400
- స్టేషన్ మాస్టర్: రూ.35,400
- గూడ్స్ ట్రైన్ మేనేజర్: రూ.29,200
- జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కం టైపిస్ట్: రూ.29,200
- సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్: రూ.29,200
👉ఎంపిక విధానం:
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (స్టేజ్-1, స్టేజ్-2), స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తు ఫీజు:
OC, BC, EWS అభ్యర్థులకు: రూ.500
SC, ST, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు: రూ.250
👉దరఖాస్తుకు చివరి తేదీ:
2024 అక్టోబర్ 13వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅నిరుద్యోగుల కోసం:- SSC GD Constable.. RPF Constable.. TS SI/Constable.. TS ఫారెస్ట్ బీట్ ఆఫీసర్.. AP గ్రూప్-2 Mains.. AP SI/Constable.. AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ “ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్” కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.