తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 పరీక్షలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) ఈరోజు (నవంబర్ 17) నిర్వహించింది. ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షలను నిర్వహించింది. పేపర్-1 & పేపర్-2 సంబంధించిన రాతపరీక్షల ప్రశ్న పత్రాలతో పాటు వాటికి నిపుణులు రూపొందించిన ఆన్సర్ ‘కీ'(Unofficial key)లను అందిస్తున్నాం. ఈ ‘కీ’లు అభ్యర్థులకు అవగాహన కోసం మాత్రమే ఉపయోగపడతాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసే ప్రిలిమినరీ ‘కీ’ని మాత్రమే అభ్యర్థులు అంతిమంగా పరిగణనలోనికి తీసుకోవాలి.
పేపర్-3 పరీక్షను నవంబర్ 18వ తేదీ ఉదయం నిర్వహించనున్నారు. మొత్తం 1,388 గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి పేపర్-1 & పేపర్-2 ప్రశ్నపత్రం మరియు ఆన్సర్ “కీ”లను డౌన్లోడ్ చేసుకోగలరు.
Group-3 Paper-1 Question Paper with key