తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 పరీక్షలు ముగిశాయి. నవంబర్ 17, 18 తారీకుల్లో నిర్వహించిన పరీక్షలకు సగం మంది గైర్హాజరయ్యారు. గ్రూప్-3 ఉద్యోగాలకు మొత్తం 5,36,477 మంది దరఖాస్తు చేయగా, 76శాతం అభ్యర్థులు మాత్రమే హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. వీరిలో సోమవారం నిర్వహించిన పేపర్-3 పరీక్షకు 2,69,483 (50.24%) మంది హాజరయ్యారు. 49.76% అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. డిసెంబర్ మొదటి వారంలో ఫలితాలు విడుదల చేసే అవకాశాలున్నట్టుగా సమాచారం.
పేపర్-3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పేపర్లో హైడ్రా, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్ల పథకంపై ప్రశ్నలొచ్చాయి. ప్రశ్నలు మధ్యస్థంగా వచ్చినట్లు అభ్యర్థులు తెలుపుతున్నారు. ప్రశ్నలు అంత సులభంగా, కఠినంగా కాకుండా మధ్యస్తంగా ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. భారత ఆర్థిక సర్వే, బడ్జెట్, తెలంగాణ బడ్జెట్, ఎకనామిక్ సర్వే, సోషియో ఎకనామిక్ ఔట్లుక్, కుటుంబ సర్వే నుంచి అధికంగా ప్రశ్నలిచ్చినట్టు తెలిపారు.
అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి నిపుణులు రూపొందించిన ఆన్సర్ “కీ” లను డౌన్లోడ్ చేసుకోగలరు. ఈ “కీ” అభ్యర్థులకు అవగాహన కోసం మాత్రమే. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసే Answer key లను మాత్రమే అంతిమంగా పరిగణనలోకి తీసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నిపుణులు రూపొందించిన ఆన్సర్ “కీ” డౌన్లోడ్ చేసుకోగలరు
Group-3 Paper-1 Question Paper with key