తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, నల్గొండ నుండి రికార్డ్ అసిస్టెంట్ టైపిస్ట్ కం అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10th క్లాస్, డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:
గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, నల్గొండ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
👉పోస్టుల వివరాలు:
- టైపిస్ట్ కం అసిస్టెంట్: 02
- రికార్డ్ అసిస్టెంట్: 02
- మొత్తం పోస్టుల సంఖ్య: 04
👉విద్యార్హతలు:
- టైపిస్ట్ కం అసిస్టెంట్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఆర్ట్స్ లేదా సైన్స్ లేదా కామర్స్ లేదా లా విభాగంలో డిగ్రీ విద్యార్హత కలిగి.. ఇంగ్లీషులో టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- రికార్డ్ అసిస్టెంట్: 10th క్లాస్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉వయోపరిమితి:
శ్రీ ఉద్యోగాలకు 18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితలో సడలింపు ఉంటుంది.
👉ఎంపిక విధానం:
రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 15-12-2024 తేదీన ఈ రెండు రకాల ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహిస్తారు.
👉దరఖాస్తు విధానం:
అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తు ఫీజు:
- ఓసి, బీసీ అభ్యర్థులు 800 రూపాయలు ఫీజు చెల్లించాలి
- ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 400 రూపాయలు ఫీజు చెల్లించాలి.
👉దరఖాస్తుకు చివరి తేదీ:
02.12.2024 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
చైర్మన్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, న్యాయ సేవా సదన్, డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రెమిసెస్, నల్గొండ.
ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం: SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable, RPF SI/కానిస్టేబుల్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.