అటవీ శాఖకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(iifm) నుండి జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, లైబ్రరీ సెమీ ప్రొఫెషనల్ ఉద్యోగాల పడితేకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 25వ తారీకు లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(iifm), భోపాల్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
👉పోస్టుల వివరాలు:
లైబ్రరీ సెమీ ప్రొఫెషనల్ గ్రేడ్ 2: 01
జూనియర్ అసిస్టెంట్: 05
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2: 03
మొత్తం పోస్టుల సంఖ్య: 09
👉విద్యార్హతలు:
లైబ్రరీ సెమీ ప్రొఫెషనల్ గ్రేడ్ 2: ఇంటర్మీడియట్ అర్హతతో పాటు లైబ్రరీ సైన్స్ సర్టిఫికెట్ కలిగి, సంబంధిత విభాగంలో రెండు సంవత్సరాలు అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జూనియర్ అసిస్టెంట్: ఇంటర్మీడియట్ అర్హతతో పాటు టైపింగ్ స్కిల్స్ కలిగి ఉండి, సంబంధిత విభాగంలో ఒక సంవత్సరం అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2: ఇంటర్మీడియట్ అర్హతతో పాటు షార్ట్ హ్యాండ్ టైపింగ్ స్కిల్స్ కలిగి ఉండి, సంబంధిత విభాగంలో రెండు సంవత్సరాలు అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉వయోపరిమితి:
18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
👉ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క అర్హత, అనుభవాన్ని ఆధారంగా చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు రాతపరీక్ష నిర్వహించి మెరిట్ వచ్చిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు విధానం:
అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తుకు చివరి తేదీ:
25-12-2024 తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅నిరుద్యోగుల కోసం: TS SI/Constable.. TS ఫారెస్ట్ బీట్ ఆఫీసర్.. AP SI/Constable.. AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్..SSC GD Constable “ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్” కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.