TSPSC Group 2: తెలంగాణ గ్రూప్-2 హాల్ టికెట్ అప్డేట్

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TGPSC Group-2: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 రాత పరీక్షలను డిసెంబర్ 15, 16 తారీకుల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను డిసెంబర్ 9వ తారీకు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. అభ్యర్థులు హాల్ టికెట్లను A4 సైజులో, కలర్ ప్రింట్ తో డౌన్లోడ్ చేసుకోవాలని కమిషన్ తెలిపింది.

Group 2 Hall Ticket Update

అభ్యర్థులను ఉదయం జరిగే పరీక్షకు 8:30 AM నుంచి 9:30 AM లోపు పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడతారు. మధ్యాహ్నం జరిగే పరీక్షకు 1:30 PM నుంచి 2:30 PM లోపు పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడతారు. ఒక నిమిషం లేట్ అయిన పరీక్షా కేంద్రంలోనికి అనుమతించరు. పరీక్షా కేంద్రాన్ని కనీసం ఒకరోజు ముందుగా సందర్శించాలని కమిషన్ తెలిపింది. పరీక్ష జరిగే రోజు.. పరీక్ష కేంద్రానికి చేరుకోవడానికి పట్టే సమయాన్ని అంచనా వేయొచ్చని సూచించింది.

Khammam job Mela 2026 notification released
Khammam Job Mela 2026 – 10th, Inter, Degree Jobs | Salary ₹18,000 | Walk-in-interview

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకొని వెళ్లకూడదని తెలిపింది. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు, బ్లూటూత్, క్యాలిక్యులేటర్, హ్యాండ్ బ్యాగ్, వాచ్, ఆభరణాలు ఎటువంటివి తీసుకుని వెళ్లకూడదని తెలిపింది. అభ్యర్థుల కేవలం చెప్పులు మాత్రమే ధరించాలని, బూట్లు వేసుకోకూడదని సూచించింది.

మొత్తం 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు సగటున 705 మంది పోటీ పడుతున్నారు.

డిసెంబర్ 15వ తేదీ ఉదయం పేపర్-1 (జనరల్ స్టడీస్), మధ్యాహ్నం పేపర్-2 (చరిత్ర, రాజకీయం, సమాజం) పరీక్ష జరగనుంది. అలాగే డిసెంబర్ 16వ తేదీ ఉదయం పేపర్-3 (ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి), మధ్యాహ్నం పేపర్-4 ( తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం) పరీక్ష జరగనుంది. ఒక్కో పేపర్ లో 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కోమార్కు. నాలుగు పేపర్లలో కలిపి 600 మార్కులు ఉంటాయి. రాత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Khammam Job Mela 2026 – Private Jobs in Khammam District for Any Degree Qualification

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

Telangana High Court Office Subordinate Recruitment
Telangana High Court Office Subordinate Recruitment 2026 | Apply Online

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!