ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రుల కార్యాలయాల్లో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ప్రతి మంత్రి కార్యాలయంలో ఒక సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, ఒక సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 25 మంత్రుల కార్యాలయాల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అసిస్టెంట్ పోస్టులకు ఏదైనా డిగ్రీ, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు B.Tech/ BE అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఎండి చైర్మన్ గా, సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులు, సబ్జెక్టు ఎక్స్పర్ట్ లు సభ్యులుగా ఉన్న కమిటీ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
👉పోస్టుల వివరాలు:
- ఎగ్జిక్యూటివ్: 25పోస్టులు
- అసిస్టెంట్: 25 పోస్టులు
Note: ఒక్కో మంత్రి పేషీలో ఒక ఎగ్జిక్యూటివ్, ఒక అసిస్టెంట్ పోస్టు భర్తీ చొప్పున.. మొత్తం 25 మంత్రుల కార్యాలయాల్లో 25 అసిస్టెంట్, 25 ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
👉విద్యార్హతలు:
- ఎగ్జిక్యూటివ్: B.Tech/ BE
- అసిస్టెంట్: ఏదైనా డిగ్రీ
👉వయోపరిమితి:
18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు.
👉జీతభత్యాలు:
- ఎగ్జిక్యూటివ్: ₹.50,000/-
- అసిస్టెంట్: ₹.30,000/-
👉ఎంపిక విధానం:
ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు విధానం:
రాష్ట్ర ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత దరఖాస్తు వివరాలు తెలుసుకొని అప్లై చేసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకోండి
✅”AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్.. AP గ్రూప్-2 Mains.. AP Constable Mains” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.