TS Govt Jobs: తెలంగాణలో ఇంటర్ అర్హతతో ఎగ్జామినర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ జిల్లా కోర్టుల్లో ఎగ్జామినర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 50 పోస్టులను భర్తీ చేస్తున్నారు. తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్ విభాగంలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష మరియు ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 8వ తారీకు నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

తెలంగాణ రాష్ట్రంలోని 20 జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

📌Join Our Whatsapp Group

🎯Join Our Telegram Group

👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

👉పోస్టుల వివరాలు: 

ఎగ్జామినర్: 50 పోస్టులు

Khammam job Mela 2026 notification released
Khammam Job Mela 2026 – 10th, Inter, Degree Jobs | Salary ₹18,000 | Walk-in-interview

👉విద్యార్హతలు: 

ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

👉వయోపరిమితి: 

18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

👉జీతభత్యాలు: 

పోస్టును అనుసరించి రూ.22,900 నుంచి రూ.69,150 వరకు జీతం ఉంటుంది.

👉ఎంపిక విధానం:

రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Khammam Job Mela 2026 – Private Jobs in Khammam District for Any Degree Qualification

👉పరీక్ష విధానం:

100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 60 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ నుంచి, 40 ప్రశ్నలు జనరల్ ఇంగ్లీష్ సబ్జెక్టు నుంచి వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. పరీక్షకు 120 నిమిషాలు సమయం ఉంటుంది.

రాతపరీక్షలో క్వాలిఫై కావటానికి ఓసీ అభ్యర్థులకు 40% మార్కులు; బీసీ అభ్యర్థులకు 35% మార్కులు; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 30% మార్కులు రావాలి.

👉దరఖాస్తు విధానం: 

అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత.. రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ ఆధారంగా చేసుకుని ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ఫారం నింపాలి.

👉పరీక్ష ఫీజు: 

ఓసి, బీసీ అభ్యర్థులు రూ.600; ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.400 ఫీజు చెల్లించాలి.

👉దరఖాస్తు తేదీలు: 

Telangana High Court Office Subordinate Recruitment
Telangana High Court Office Subordinate Recruitment 2026 | Apply Online

08-01-2025 తేదీ నుంచి 31-01-2025 తేదీ వరకు హైకోర్టు అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Official Website

✅తెలంగాణ నిరుద్యోగుల కోసం: “జిల్లా కోర్టు/ హైకోర్టు ఉద్యోగాలు, SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్+Test Series “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!