తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టు/ హైకోర్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలైన విషయం తెలిసిందే. మొత్తం 17 రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1673 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాల రాత పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం..
తెలంగాణలోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
- ప్రాణహిత వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? Ans: మంచిర్యాల జిల్లాలో 136.02 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది.
- కవాల్ వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? Ans: మంచిర్యాల మరియు నిర్మల్ జిల్లాలో 892.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉంది.
- మంజీరా వన్యపాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? Ans: సంగారెడ్డి జిల్లాలో 20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.
- శివరామ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? Ans: మంచిర్యాల మరియు పెద్దపల్లి జిల్లాల్లో 29.81 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంతో విస్తరించి ఉంది.
- పాకాల వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? Ans: మహబూబాబాద్ జిల్లాలో 860.2 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది
- కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? Ans: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 635.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది
- ఏటూరు నాగారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? Ans: జయశంకర్ జిల్లాలో 803 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది
- పోచారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? Ans: మెదక్ మరియు కామారెడ్డి జిల్లాలో 129.84 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది
- అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఏ జిల్లాలో ఉంది? Ans: నాగర్ కర్నూల్ మరియు నల్గొండ జిల్లాల్లో 2166.37 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది.
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం: జిల్లా కోర్టు/ హైకోర్టు ఉద్యోగాలు, SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, RRB Group-D, SBI Clerk ” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.